అందరికీ శార్వరి యుగాది శుభాకాంక్షలతో,
సర్వేశ్వరునికి మ్రొక్కెద
గర్వము లేనట్టి జ్ఞాన గరిమలనొసగన్
శార్వరి సంవత్సరమున
సర్వులకారోగ్యమిచ్చి సంరక్షింపన్
శార్వరి యుగాది రోజున
నుర్విని గల బంధుమిత్రులురుతర పూజ్యుల్,
గుర్వాదులకందరికిన్
పర్వపు శుభకామనములు, వందన శతముల్
శార్వరి యుగాది వచ్చెను
సర్వులు గృహమున, "కరోన" సద్దణచ, మనన్
శార్వర-నిశ్శబ్దముగన్
సర్వము జరుపగ వలెనను సందేశముతో!
(శార్వర నిశ్శబ్దము - రాత్రిపూట ఉండే నిశ్శబ్దం)
గర్వము లేనట్టి జ్ఞాన గరిమలనొసగన్
శార్వరి సంవత్సరమున
సర్వులకారోగ్యమిచ్చి సంరక్షింపన్
శార్వరి యుగాది రోజున
నుర్విని గల బంధుమిత్రులురుతర పూజ్యుల్,
గుర్వాదులకందరికిన్
పర్వపు శుభకామనములు, వందన శతముల్
శార్వరి యుగాది వచ్చెను
సర్వులు గృహమున, "కరోన" సద్దణచ, మనన్
శార్వర-నిశ్శబ్దముగన్
సర్వము జరుపగ వలెనను సందేశముతో!
(శార్వర నిశ్శబ్దము - రాత్రిపూట ఉండే నిశ్శబ్దం)
No comments:
Post a Comment