Sunday, March 29, 2020

(కం.) 
ఎవ్వని భయమున వాయువు
రివ్వున వీచును, వెలుగుల ఱేడుదయించున్
ఎవ్వని భయమింద్రాగ్నుల
కెవ్వని భయమా"యమునికి" నీశ్వరు డతడే!

"భీషాస్మాత్" ఇత్యాదిగా తైత్తిరీయ ఉపనిషత్తు చెప్పిన మాటలివి.
ఎవరి శాసనానికి భయపడి(లోబడి) వాయువు వీస్తూ జగతిని పావనము చేయునో, ఎవరికి భయపడి (చీకటిని తరిమేస్తూ) సూర్యుడు(వెలుగులఱేడు) ఉదయించునో, ఎవరికి లోబడి ఇంద్రుడు, అగ్ని మొదలగు దేవతలందరూ తమ తమ విధులను నిర్వర్తిస్తారో, చివరికి అందరినీ భయపెట్టే మృత్యుదేవతయైన యముడుకూడా ఎవరికి భయపడి తన పనులను చేస్తాడో వాడే ఈశ్వరుడు, నారాయణుడు. వాడే బ్రహ్మమని పిలవబడు వస్తువు.

No comments:

Post a Comment