Sunday, March 29, 2020

అభయములిచ్చెడి సింహము,
నభమును దాటు ప్రభ లీను నైజపు సింహం,
ఇభ సదృశ దైత్య సింహము,
స్వభీష్టదశ్రీనృసింహ! వసుధను, నీవే!

స్తంభము బగులగ వెలువడి

గంభీర రవముల తోడ గనకకశిపు హృత్
కుంభోదరముల జీల్చిన
డింభకరక్షక నృహరిని డెందము నిడెదన్

[డెందము=హృదయము, డింభకుడు=పిల్లవాడు, (ప్రహ్లాదుడు), కనకకశిపుడు=హిరణ్యకశిపుడు]

ఈ భూమిమీద ఎన్నో వనసింహాలను, గ్రామసింహాలనూ చూస్తూ ఉంటాం. కానీ అవేవీ అభయాలనూ, అభీష్టాలనూ ఇవ్వవు. మదపుటేనుగుల్లా బలిసిన మన అంతఃశత్రువులనూ బాహ్యశత్రువులనూ చంపే సింహాలు కావవి. ఆకాశమంతా వ్యాపించే ప్రభ ఆ సింహాలకు లేదు. కానీ ఈ అన్ని గుణాలనూ కలిగిన ఒకే ఒక అరుదైన లక్ష్మీసమేతమైన నరసింహము నీవేనయ్యా!


No comments:

Post a Comment