Sunday, March 29, 2020

(కం.) 
కమలపు నీ పాదములకు
భ్రమరము నయ్యెద సుగుణ పరాగము గ్రోలన్
భ్రమరము నీవవఁగను హృ-
త్కమలము నర్పించెద హరి! కైంకర్యముకై


ఓ శ్రీహరీ! నీ పాదములు కమలములైతే నేను ఆ కమలములలోని అమృతప్రదములైన నీ సద్గుణాలు అనే పుప్పొడిని గ్రహించే తుమ్మెదనౌతాను. లేక నీవే తుమ్మెదవైతే నా హృదయకమలమనే పుష్పాన్నే నీ సేవకోసం అర్పిస్తాను.

No comments:

Post a Comment